మళ్లీ టాస్‌ గెలిచిన సఫారీలు.. భారత్‌కు బ్యాటింగ్‌ అవకాశం..

-

ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య 5 మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్‌ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ ఇరు జట్లు ఆడగా.. 2-2తో సమంగా ఉన్నారు. అయితే నేడు ఆఖరి ఐదో మ్యాచ్‌ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సఫారీలు బౌలింగ్‌ ఎంచుకున్నారు. విషయం ఏంటంటే ఈ సిరీస్‌లో ఒక్కసారి కూడా టీమిండియా టాస్‌ గెలువలేదు. టీమిండియాకు సారథ్యం వహిస్తున్న రిషబ్‌ పంత్‌ వరుసా టాస్‌లో ఓడిపోవడం గమనార్ం. అయితే.. గత నాలుగవ మ్యాచ్‌లో సపారీలకు సారథ్యం వహించిన టెంబా బవుమా ఈ మ్యాచ్ ఆడటం లేదు.

దాంతో స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఆ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ సిరీస్‌లో డిసైడర్ అయిన ఐదో మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని సమాచారం. టాస్ గెలిచిన కేశవ్ మహరాజ్ తమ జట్టులో మూడు మార్పులు జరిగినట్లు చెప్పాడు. బవుమాతోపాటు తబ్రయిజ్ షంసీ, మార్కో జాన్సెన్ ఆడటం లేదని.. వారి స్థానంలో ట్రిస్టియన్ స్టబ్స్, రీజా హెండ్రిక్స్, కగిసో రబాడ ఆడుతున్నట్లు తెలిపాడు. భారత జట్టులో ఎలాంటి మార్పులూ లేవని పంత్ వెల్లడించాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version