Breaking : తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌

-

గత నెల మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివారం తెలంగాణ హైకోర్టు ప్రధాన
న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భుయాన్‌ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రస్తుతం హైకోర్టు సీజేగా కొనసాగుతున్న సతీశ్‌ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. హైకోర్టు సీజేగా నియామకమైన ఉజ్జల్‌ భుయాన్‌ ప్రస్తుతం తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలోనే సేవలందిస్తున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సీజేగా పదోన్నతి లభించింది. జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ 1964, ఆగస్ట్‌ 2న గువాహటిలో జన్మించారు.

గువాహటిలోని డాన్‌బాస్కో పాఠశాలలో విద్యనభ్యసించారు. స్థానిక ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఆయన గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2010లో గువాహటి హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా చేరారు ఉజ్జల్‌ భుయాన్‌. 2011లో అసోం అదనపు ఏజీగా, అదే సంవత్సరం అక్టోబర్‌లో గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భుయాన్‌ నియామకమయ్యారు. 2019లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు ఉజ్జల్‌ భుయాన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version