RSA Vs ENG : సత్తా చాటిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే..?

-

ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా ఇవాల సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు కేవలం 179 పరుగులకే కుప్ప కూలింది. ఈ ఛాంపియన్స్ ట్రోపీలో ఇంగ్లండ్ ఇదే అతి తక్కువ స్కోర్ చేయడం గమనార్హం. తొలి ఓవర్ లోనే ఫిలిప్ సాల్ట్ 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచే ఇంగ్లండ్ పతనం ప్రారంభం అయింది.

డకెట్ 24, స్మిత్ 0, రూట్ 37, హార్రీ బ్రూక్ 19, బట్లర్ 21, లివింగ్ స్టన్ 09, జెమీ ఓవర్టన్ 11, ఆర్చర్ 25, అదిల్ రషీద్ 02, షకీబ్ మహమ్మద్ 05 పరుగులు చేశారు. దీంతో సౌతాఫ్రికా విజయానికి 180 పరుగులు కావాలి. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 03, మడర్ 03, కేశవ్ మహరాజ్ 2, ఎంగిడి, రబాడ చెరో వికెట్ తీసుకున్నారు. 38.2 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 179 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా సెమీస్ వెళ్లినట్టు ఖాయంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news