బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా మారాయి. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మరికొన్ని రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. దీంతో ఈ ఏడాది మే చివరి వారంలోనే దేశంలో రుతుపవనాలు విస్తరించనున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాల వల్ల వర్షాలు కురవనున్నాయి. ఇదిలా ఉంటే నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడును ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మే 17 నుంచి కేరళలో నైరుతి తొలకరి జల్లులు ప్రారంభం కానున్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ, అస్సాం ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే అస్సాం రాష్ట్రంలో తీవ్ర వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. ఇదిలా ఉంటే రుతుపవనాలు వస్తున్నయనే చల్లని కబురుతో రైతన్నల్లో ఆనందం నెలకొంది. ఈసారి 99 శాతం వర్షపాతనం నమోదు అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.