నాన్న గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది:ఎస్పీ చరణ్

-

గత నెల 5న కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్రమంగా కోరుకుంటున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో ఆగస్టు 13 రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇక అక్కడి నుంచి కూడా ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతూ వస్తోంది.

సెప్టెంబర్ 14న తన తండ్రి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 15 నుంచి 20 నిమిషాలపాటు కూర్చోగలుగుతున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. కాసేపటి క్రితం ఎస్పీ చరణ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తన తండ్రి ఈసీఎంఓ సపోర్టుతో ఉన్నారని ఫిజియోథెరపీ లో చురుకుగా పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి త్వరగా కోలుకోవాలని నిరంతరం ప్రార్ధించిన ఆసుపత్రి వైద్యులకు ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ బాలు కి సెప్టెంబర్ 7న కరోనా నెగిటివ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version