మోడీ ప్రభుత్వం.. చైనా వైపా.?

-

గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్ర స్థాయిలో తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ముఖ్యంగా సరిహద్దు ల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు తప్పుబడుతూ తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భారత ప్రభుత్వం సరిహద్దుల్లో చైనాకు అనుకూలంగానే వెళ్తుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.

 

ఇక ఇటీవల మరోసారి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ విరుచుకుపడ్డారు. ఇటీవలే పార్లమెంట్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్రకటనను.. ఇటీవలే కేంద్ర హోం శాఖ చేసిన ప్రకటన గురించి ప్రస్తావిస్తూ విమర్శలు చేసారు. భారత సరిహద్దుల్లో కి ఎవరూ చొరబడి లేదని ముందుగా మోదీ సర్కార్ చెప్పి… మెజారిటీ చైనా వాటా కలిగిన బ్యాంక్ నుంచి మోదీ సర్కార్ లోన్ తీసుకుంది అంటూ విమర్శించారు రాహుల్ గాంధీ. అయితే పార్లమెంటులో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించి ఉంది అని రక్షణ శాఖ మంత్రి చెబితే… తాజాగా అలాంటి ఆక్రమణలు ఏమీ జరగలేదని హోంశాఖ మంత్రి చెప్పడం విడ్డూరం అంటూ విమర్శించారు. అసలు మోదీ సర్కార్ భారత సైన్యం వైపా..? లేకపోతే చైనా వైపా..? అంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version