పార్లమెంట్ ఎన్నికల నియమావళిని అమలు చెయ్యాలి..!

-

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్నగర్ లో బెజ్జూర్ పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు గురించి ఆరా తీశారు. పోలీస్ స్టేషన్లో కేసులకు సంబంధించిన ఫైళ్ళని పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను కూడా చూశారు. తదుపరి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ కి వచ్చే కంప్లైంట్ లు మర్యాదపూర్వకంగా ఉంటూ వారి యొక్క సమస్యల్ని ఓపికతో విని వాటిని పరిష్కరించాలని అన్నారు.

ప్రజలకి మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు సిబ్బంది పోలీస్ స్టేషన్ లోని ప్రతి గ్రామం గురించి అవగాహన కలిగి ఉండాలని ప్రజలతో మమేకమై ప్రజలకి మరింత చేరుకోవాలని ఆయన అన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎలక్షన్స్ కి సంబంధించి సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ఎన్నిక నియమావళి రాజకీయ పార్టీలకి వ్యక్తులకి అతీతంగా నిష్పక్షపాక్షితంగా పారదర్శకంగా అమలు చేయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news