ఈ రోజు టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తలకు జరిగిన గొడవ గురించి ఆంధ్రప్రదేశ్ అంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈ గొడవల గురించి చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కీలకమైన వివరాలను వెల్లడించారు. టీడీపీ కార్యకర్తలు ప్లాన్ ప్రకారం ఈ గొడవకు పాల్పడ్డారని ఎస్పీ చెప్పాడు. ముందుగా టీడీపీ వాళ్ళు బీరు బాటిళ్ళు మరియు కర్రలతో దాదాపుగా 2 వేల మంది వచ్చారని ఈయన తెలిపారు. వాస్తవంగా అయితే వీరంతా పుంగనూరు బై పాస్ మీదుగా చిత్తూరుకు వెళ్లాల్సి ఉంది, కానీ అనుకున్న ప్లాన్ ప్రకారం పుంగనూరు లోపలికి రావడానికి ప్రయత్నించారని రిషాంత్ రెడ్డి తెలియచేశారు. విచక్షణారహితం చేసిన టీడీపీ నాయకుల దాడి వలన 14 పోలీసులు గాయాల పాలయ్యారని ఎస్పీ పేర్కొన్నారు. ఇంకా డిపార్ట్మెంట్ కు చెందిన రెండు వాహనాలను దగ్ధం చేసినట్లుగా ఎస్పీ తెలియచేశారు.
టీడీపీకి రాజకీయంగా ఏమైనా శత్రుత్వం ఉంటే ఆ విధంగానే వసతిని చూసుకోవాలి కానీ ఇలా పొలిసు లపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు అంటూ ఎస్పీ రిషాంత్ రెడ్డి వివరించారు.