విక్రాంత్‌తో ఐలాండ్ తీరంలో రొమాన్స్ చేస్తున్న మెహరీన్

-

కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మెహరీన్ కౌర్‌ ఫిర్జాదా. అందాల తారా మెహరీన్ కౌర్‌ ఫిర్జాదా తాజాగా నటిస్తోన్న చిత్రం స్పార్క్‌. ఈ సినిమాలో విక్రాంత్‌ హీరోగా నటిస్తున్నారు. డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రంతో విక్రాంత్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే.. రుక్సార్‌ ధిల్లాన్‌, మెహరీన్‌ కౌర్‌, విక్రాంత్‌ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. స్పార్క్‌ టీం అందమైన ఐలాండ్‌ ప్రాంతంలో మెహరీన్‌-విక్రాంత్‌ పై వచ్చే రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరణను పూర్తి చేసింది. స్పార్క్‌ పాటలు హృదయం ఫేం అబ్దుల్‌ వహబ్‌ మెలోడియస్‌ మ్యూజికల్‌ ట్యూన్స్‌తో సంగీత ప్రియుల్ని ఆకట్టుకునేలా ఉండబోతున్నాయని సినిమా టీం కాన్ఫిడెంట్‌గా ఉంది.

 

స్పార్క్‌ టీం త్వరలోనే భారత్‌కు రానుంది. త్వరలో మున్నార్‌, వైజాగ్‌ ప్రాంతాల్లో నెక్ట్స్ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో నాజర్‌, వెన్నెల కిశోర్‌, షాయాజీ షిండే, సుహాసినీ మణిరత్నం, శ్రీకాంత్‌, కిరణ్‌ అయ్యంగార్‌, అన్నపూర్ణమ్మ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో గురు సోమసుందరం విలన్‌గా నటిస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్‌ అరవింద్‌ కుమార్‌ రవివర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రవివర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ కూడా కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version