కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ప్రవేశద్వారాల వద్ద నిరసన ప్రదర్శనలను నిషేధించారు స్పీకర్ ఓం బిర్లా. ఏ ప్రవేశ ద్వారం వద్ద ఏలాంటి నిరసన ప్రదర్శనలు చేయరాదని ఎంపీలందరికీ ఆదేశాలు జారీ చేశారు స్పీకర్ ఓం బిర్లా. రాహుల్ గాంధీ పై పోలీసు కేసు నమోదు అయింది.
వడోదర బిజేపి ఎంపీ హేమాంగ్ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీ పై కేసు నమోదు అయింది. ప్రశ్నించేందుకు రాహుల్ గాంధీ ని పిలుస్తామని చెప్పారు సంబంధిత పోలీసు అధికారి. సంఘటన జరిగిన ప్రాంతంలోని “సిసిటివి ఫుటేజీ”ని ఇవ్వాలని పార్లమెంట్ కార్యాలయంను కోరనున్నారు పోలీసులు. ఇక అటు బిజేపి ఎంపీల పై కాంగ్రెస్ ఎంపీల బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన పై విచారణ జరపాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లా కు లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీలు.