గ్రేటర్ లో స్పెషల్ ఆఫీసర్ పాలన అందుకేనా..ప్యూహం మార్చిన టీఆర్ఎస్

-

షెడ్యూల్‌ కంటే ముందుగానే గ్రేటర్ ఎన్నికలు జరిగాయి. కానీ.. కొత్త పాలకవర్గానికి ఇప్పట్లో మోక్షం దక్కేలా లేదా? బల్దియా మరోసారి స్పెషల్‌ ఆఫీసర్ల చేతిలోకి వెళ్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తిస్థయి మెజారిటీ ఇవ్వలేదు ఓటర్లు. అధికార టీఆర్‌ఎస్‌కు ఎక్స్‌ అఫీషియో ఓటర్లు దండిగా ఉన్నా మేయర్‌ పీఠం దక్కే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ ప్యూహం మార్చింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో 150సీట్లలో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ సెంచరీ కొట్టాలని అనుకుంది. చివరకు 55దగ్గరే ఆగిపోయింది. మేయర్‌ పీఠం కైవశానికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు పరిశీలించిన తర్వాత కొత్త సమస్యలు కోరి తెచ్చుకునే ఉద్దేశంలో టీఆర్‌ఎస్‌ లేదని తెలుస్తోంది. ప్రస్తుత పాలకవర్గం గడువు ముగిసిన తర్వాత స్పెషలాఫీసర్‌ పాలనకు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఒకవేళ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎంఐఎం మద్దతు తీసుకున్నా బీజేపీకి లాభిస్తుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. అందుకే ఎంఐఎంతో దోస్తీకి వెళ్లకుండా గ్రేటర్‌ పీఠాన్ని వదిలి వేసేందుకే టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుత గ్రేటర్ పాలకమండలికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వరకు సమయం ఉంది. కొత్త కార్పొరేటర్లు ఎన్నికైనా పాత పాలకవర్గాన్ని రద్దు చేయాలేదు. ఇప్పుడు రద్దు చేసే అవకాశాలు కనిపించడం లేదు. అంటే ఫిబ్రవరి 10 వరకు ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఎన్నికైన వారు ఉత్సవ విగ్రహాలుగానే ఉండిపోక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కనీసం 70 కార్పొరేట్‌ స్థానాలు వచ్చినా సమస్య ఉండేది కాదు. కనీసం ఓ పది మంది ఇండిపెండెంట్లు గెలిచినా సమీకరణాలు మరోలా ఉండేవి. ఒక్క ఇండిపెండెంట్‌ గెలవలేదు. కాంగ్రెస్‌ రెండుచోట్ల మినహా మిగతా అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పంచుకున్నాయి. ఈ మూడు పార్టీలు ఒకదానితో ఒకటి కలిసే పరిస్థితి లేదని అనుకుంటున్నారు.

అయితే ఇక్కడ ఒకే ఒక ఆప్షన్‌ కనిపిస్తోంది. అది టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలవడం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. బీజేపీకి ఎలాంటి ఛాన్స్‌ ఇవ్వకూడదని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అందుకే అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్‌ను నో చెప్పేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జమేలి ఎన్నికలు జరుగొచ్చనే ప్రచారం కూడా ఊపందుకొంది… ఈ పరిస్థితి ల్లో గ్రేటర్ పాలన అధికారులకు వదిలేయటం ఉత్తమంగా భావిస్తున్నారు…హైదరాబాద్ మున్సిపాల్టీలో పాలక వర్గం కన్నా స్పెషల్ ఆఫీసర్ల పాలనే అధికంగా ఉండేది.

1970లో ఎంసీహెచ్ రద్దయినప్పుడు.. దాదాపు పదహారేళ్ల పాటు అధికారుల పాలనలో ఉంది.. 93 నుంచి 2002 వరకూ ఇలాగే సాగింది. 2002లో జరగిన ఎన్నికల్లో మేయర్ గా తీగల కృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. 2007 లో పాలక వర్గం గడువు ముగియగానే 2009 వరకూ స్పెషల్ ఆఫీసర్ల పాలనే కొనసాగింది. 2014లోనూ ఇలాగే జరిగింది. పాలక వర్గం గడువు ముగియగానే స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్లాయి బల్దియా వ్యవహారాలు..

Read more RELATED
Recommended to you

Exit mobile version