గతంలో కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. దీనికి తోడు భారీ వరదలు వయనాడ్‌ను ముంచెత్తాయి. దీంతో అక్కడ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.ఈ క్రమంలోనే వయనాడ్‌కు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని ఇటీవల అక్కడి నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందిన ప్రియాంకగాంధీ పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు.
వయనాడ్‌కు స్పెషల్ ప్యాకేజ్ కేటాయించాలంటూ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, కేరళ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.కేరళ, వయనాడ్ పట్ల వివక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఎంపీలు నినాదాలు చేశారు. వచ్చే బడ్జెట్‌లో స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలని ఈ సందర్భంగా కోరారు.