ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న చంద్రబాబు ”కంట తడి”

-

తన భార్య భువనేశ్వరిపై, తన కుటుంబ సభ్యులపై వైసీపీ ప్రజాప్రతినిధుల అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతం కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. చంద్రబాబు భార్యను తామేమి అనలేదని.. వైసీపీ అంటుంటే.. టీడీపీ నేతలు మాత్రం..బూతులు తింటారనే చెబుతోంది. అయితే..ఈ ఎపిసోడ్‌ పై ఎవరు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం.

చంద్రబాబు ఏడుపు పెద్ద డ్రామా : జగన్‌

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ, ప్రెస్‌ మీట్‌ లో ఎడవటం పై సీఎం జగన్‌ అసెంబ్లీలో సెటైర్లు వేశారు. చంద్రబాబు కళ్లల్లో నీళ్లు లేకపోయినా… నీళ్లు వచ్చాయని డ్రామా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఏడుపు పెద్ద డ్రామా అని… అన్ని రాజకీయాల కోసమేనని మండిపడ్డారు సీఎం జగన్‌. దేవుడి దయ, ప్రజల దీవెన ఉన్నంత కాలం.. ఎల్లో మీడియా ఏం చేయలేదన్నారు సీఎం జగన్‌. మనం మంచి చేసేంద కాలం దేవుడు ఆశీర్వదిస్తాడని… ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ 5 లాంటి మీడియా సంస్థలు నాకు లేవన్నారు. చిన్నాన్న వివేకాను ఎవరన్నా ఏమన్నా చేసుంటారంటే.. అది టీడీపీ వాళ్లే చేసుండాలన్నారు. రైతుల చర్చలో విపక్ష సభ్యులు లేకపోవడం దుర దృష్టకరమన్నారు. చంద్రబాబు సంబంధం లేని విషయాలను తీసుకు వచ్చి రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ భరతం పడతాం : బాలయ్య వార్నింగ్

వైసీపీ నేతలపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతులు కట్టుకు కూర్చోలేదు..ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకోమని మండిపడ్డారు. మళ్లీ మాటలు జారితే.. మీ భరతం పడతామని వైసీపీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు బాలయ్య. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారని… నా సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఉన్నామో… పశువుల కొంపలో ఉన్నామో అర్థం కాలేదని ఫైర్ అయ్యారు బాలకృష్ణ. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు… హేళన చేయవద్దని మండిపడ్డారు బాలకృష్ణ. కొత్త నీచ సంస్కృతికి తెరలేపారు.. ఆ పార్టీలోనూ బాధపడే వారున్నారన్నారు బాలకృష్ణ. ఏకపక్షంగా సభ ను నడుపుతున్నారని..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలంతా గమ నిస్తున్నారని వెల్లడించారు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆనవాయితేనని… ప్రజాసమస్యలపై పోరాడటమే అ సెంబ్లీ వేదికగా ఉండేదన్నారు. అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండా తీసు కొచ్చారన్నారు బాలకృష్ణ. నోటితో కాదు, ఓటుతో జ‌వాబు చెప్పాలని పేర్కొన్నారు.

వైసీపీకి నందమూరి రామకృష్ణ వార్నింగ్‌

ఈ ఘటనపై నందమూరి రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. రెండు, మూడేళ్ల నుంచి చూస్తున్న ఘటనలు చూస్తుంటే… చాలా బాధగా ఉందన్నారు. తమ కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పరిణామం ఏ కుటుంబానికి జరగకూడదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, కోడాలి నాని, అంబటి రాంబాబులతో పాటు వల్లభనేని వంశీలకు స్ట్రయిట్ గా వార్నింగ్ ఇచ్చారు.హద్దులు మీరారని.. వారు భవిష్యత్ గురించి ఆలోచించుకోని మాట్లాడాలన్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లు ఏమనుకుంటున్నారో చూసుకోండి అంటూ ఫైరయ్యారు నందమూరి రామకృష్ణ. తామేం గాజులు తొడుక్కుని కూర్చోలేదని.. ఎన్టీఆర్, టీడీపీ క్రమశిక్షణ మాత్రమే నేర్పిందని పేర్కొన్నారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని నందమూరి రామకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై వైసీపీ హద్దు మీరితే… తామూ హద్దు మీరుతామని స్పష్టం చేశారు.

చంద్రబాబుపై కొడాలి ఫైర్‌

తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి చంద్ర బాబు లాక్కుంటే ఎన్టీఆర్ ఇంత కంటే ఎక్కువ గా ఏడ్చార‌ని మంత్రి కొడాలి నాని అన్నారు. కాని ఆయ‌న చంద్ర బాబు ల బ‌య‌ట కు వచ్చి ఏడ్వలేద‌ని అన్నారు. అలాగే రాజకీయంగా బ్రతకడానికి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం భార్యాను కూడా బజారుకు ఇడ్చాడని విమర్శించారు. చంద్రబాబు సతీమణి పై ఎవరు వ్యాఖ్యలు చేశారో, ఏమని వ్యాఖ్యానించారో ఎందుకు చెప్పటం లేదని ప్ర‌శ్నించారు.

నారా రోహిత్‌ ఆగ్రహం

హీరో నారా రోహిత్ సైతం నిన్న అసెంబ్లీలో జ‌రిగిన ప‌రిణామాల‌పై తీవ్రంగా మండిప‌డ్డారు. ప‌శువుల కంటే హీనంగా కొంద‌రు అధికార‌పార్టీ నేత‌లు ప్ర‌వర్తిన్నార‌ని నారా రోహిత్ అభిప్రాయప‌డ్డారు. స‌మ‌స్య‌ల గురించి చ‌ర్ఛించాల్సిన అసెంబ్లీలో చంద్రబాబును ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిని దూశించ‌డం దిగ్భ్రాంతికి గురిచేసింద‌న్నారు. రాజ‌కీయాల‌పై…విధానాల‌పై విమ‌ర్శ‌లుండాలి గానీ కుటుంబ స‌భ్యుల‌ను లాగ‌టం స‌రికాద‌న్నారు. రాజ్యాంగం క‌ల్పించిన వాక్ స్వాతంత్య్రం హ‌క్కును దుర్వినియోగం చేస్తున్నార‌ని అన్నారు.

ఏడ్చే మగవాణ్ణి అస్సలు నమ్మొద్దు : వర్మ

ఏడ్చే మగాళ్లను నమ్మకూడదంటూ ట్వీట్‌ చేశాడు రామ్‌ గోపాల్‌ వర్మ. ”ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని ఎవరో పూర్వీకులు చెప్పారని నేను ఎప్పుడో విన్నాను..కానీ నేను నవ్వే ఆడదాన్ని ఇష్టపడతాను, ఎందుకంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి , కానీ బలం మరియు ధైర్యం చూపించాల్సిన మగాడు పబ్లిక్ లో ఏడిస్తే జాలి కాదు, జుగుప్స పుడుతుంది ” అంటూ సంచలన ట్వీట్ చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ. అలాగే.. వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలను కూడా షేర్‌ చేశాడు రామ్‌ గోపాల్‌ వర్మ.

ఇది సిగ్గు చేటు : పవన్‌ కళ్యాణ్‌

చంద్రబాబు ఎపిసోడ్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కుటుంబ సభ్యులను కించపరచటం తగదని… ఇది సిగ్గుచేటు అని… ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజా ప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఫైర్ అయ్యారు. తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని చంద్రబాబు కంట తడి పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు.

నాకు ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉంది : రోజా

చంద్రబాబు ఏడవటం పై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి సెటైర్లు పేల్చారు. చంద్రబాబు నాయుడు ఏడవటం తనకు చాలా ఆనందంగా ఉందని… రోజా ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు… ఎన్టీ రామారావు ను ఏడిపించిన సంగతి ఎవరు మర్చిపోలేదని తెలిపారు. పైన దేవుడు ఉన్నాడని.. అందుకే చంద్రబాబు చేత ఈరోజు కంటతడి పెట్టించాడు అని చురకలంటించారు ఎమ్మెల్యే రోజా. అంతేకాదు గతంలో వైయస్ విజయమ్మ అలాగే వైయస్ భారతి నీ కూడా చంద్రబాబు ఏడిపించారని మండిపడ్డారు. తనను కూడా చంద్రబాబు… అనేక అవమానాలు చేశాడు అని మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version