పవన్ కల్యాణ్ ఆస్తుల విలువ తెలుసా?

-

పవన్ కల్యాణ్… ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలిసిందే. ఈ లెక్కన చూస్తే పవన్ దగ్గర ఆస్తుల విలువ భారీ మొత్తంలో ఉండాలి. కానీ పవన్ ఆస్తుల విలువ చూస్తే ఆశ్చర్యమే కలుగుతుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. పవన్ కు రూ. 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్

జూబ్లీహిల్స్ లో ఓ ఖరీదైన బంగ్లా, 18 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుంది. 312 గ్రాముల బంగారం ఉంది. రాజకీయాల్లోకి రావడంతో ఖర్చు కూడా పెరిగిపోయింది. అందుకే తన సంపద అంతా దానికి ఖర్చవుతున్నట్లు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్

తన సతీమణి అన్నా లెజినోవా వద్ద రూ. 30 లక్షల చరాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద కుమారుడు అకీరా పేరు మీద రూ. 1.5 కోట్లు, కూతురు ఆద్య పేరు మీద రూ. 1.04 కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. చిన్న కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు. చిన్న కుమార్తె పోలేనా పేరు మీద కూడా ఎలాంటి ఆస్తులు లేవు. పవన్ కు రూ. 30 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు చెబుతున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద రూ. 2.5 కోట్లు అప్పుగా ఉన్నారు. ఆస్తులు అప్పులు చూస్తే.. ఓవరాల్ గా పవన్ కల్యాణ్ కు పెద్దగా ఆస్తులు లేవని చెబుతున్నారు.

పవన్ కల్యాణ్

వాణిజ్య ప్రకటనల్లో నటిస్తే భారీగానే రెమ్యునరేషన్ వచ్చే అవకాశమున్నా.. తన సిద్ధాంతాలకు వ్యతిరేకమని పవన్ వాటి జోలికి వెళ్లడం లేదు. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాల్లో సంపాదన అంతా ప్రజాసేవకే ఖర్చు చేస్తున్నారు.

దీంతో పవన్ కు ఉన్న ఆదాయానికి భారీగా ఆస్తులు కూడబెట్టుకునే లేకుండా పోయింది. ఆస్తుల మీద తనకు పెద్దగా ఇంట్రస్ట్ లేదని పలుమార్లు పవన్ చెప్పడం కూడా ఆయన నిరాడంబరతకు నిదర్శనం. అందుకే తను ఆస్తులు పెంచుకునే బదులు అభిమానులను పెంచుకున్నాడు. ప్రేక్షకులకు ఆరాధ్యుడయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version