నేటి నుంచి ఏరో స్పోర్ట్స్ ఫెస్టివల్…

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రపథమంగా ఏరో స్పోర్ట్సు ఫెస్టివల్‌కు శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట చారిత్రాత్మక ఘట్టానికి వేదికకానుంది.  సీతంపేటలోని ఎన్టీఆర్‌ అడ్వంచర్ పార్కులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి ఏరో స్పోర్ట్సు ఫెస్టివల్ జరగనుంది. టూరిజం ప్రమోషన్ లో భాగంగా తొలిసారిగా సిక్కోలులో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ కోసం 6 పారామోటరింగ్‌ యూనిట్లు , 1 పవర్డ్‌హ్యాంగ్‌ గ్లైడర్, 2 హాట్ ఎయిర్ బెలూన్ యూనిట్లు, 1 పారా సెయిలింగ్, 3 రిమోట్ కంట్రోల్ ఫ్లైయింగ్ యూనిట్లు సిద్ధమయ్యాయి. దేశం నలుమూలల నుంచి  15 మంది పైలట్లు, 40 మంది సహాయక సిబ్బంది ఈ ఫెస్టివల్ కోసం వస్తున్నారు.

ప్రజల వీక్షణ కోసం పారామెటారింగ్‌, రిమోట్ కంట్రోల్ ఫ్లైయింగ్‌ను ఉదయం, సాయంత్రం అరగంటపాటు నిర్వహిస్తారు. పర్యాటకాన్ని ఆకర్షించే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version