సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. హెచ్‌సీఏ (HCA)తో వివాదం నేపథ్యంలో సన్‌రైజర్స్ జట్టును ఏపీకి రావాలని సాదరంగా ఆహ్వానం పలికింది. పన్ను మినహాయింపులు, ఇతర సహకారం అందిస్తామని చెప్పింది. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను విశాఖలో నిర్వహించాలనే ప్రతిపాదన చేసింది ఏసీఏ. సన్‌రైజర్స్ జట్టు సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని ఆంధ్రా క్రికెట్ సంఘం వెల్లడించింది.
మరోవైపు ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (KKR Vs SRH ) తలపడనుంది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ ‘300’ కొడుతుందా? లేదా? ‘పిచ్’ ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. 300 పరుగులు చేయకపోయినా.. కనీసం బౌలర్లు కాచుకొనేంత టార్గెట్ అయినా ప్రత్యర్థి జట్టు ముందు ఉంచాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కోల్‌కతా శిబిరంలో ఆందోళన కలిగించిన అంశం ‘పిచ్’. అయితే స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నా.. బ్యాటింగ్ చేయడమూ పెద్ద కష్టం కాబోదనేది విశ్లేషకులు అంటున్నారు.