HCUపై సుప్రీంకోర్టు తీర్పు.. ప్రభుత్వానికి చెంపదెబ్బ: రఘునందన్‌రావు

-

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అడవిలోని చెట్లను నరికేసి అభివృద్ధి చేయాల్సినంత అవసరం ఏంటని.. చెట్లను కొట్టివేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా అంటూ సీఎస్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే హెచ్‌సీయూ భూముల విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.

ఈ వ్యవహారంలై విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని రఘునందన్‌రావు అన్నారు. ప్రభుత్వ తీరుపై హెచ్‌సీయూ విద్యార్థుల పోరాట ఫలితంగానే కోర్టు తీర్పు వచ్చిందని తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం తాము కూడా పోరాడతామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని.. ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లు కొట్టవద్దని వాల్టా చట్టం చెబుతోందని వ్యాఖ్యానించారు. ఒక్క చెట్టు కొట్టడానికే అనుమతి అవసరమైతే.. వందల చెట్లు ఎలా కొట్టారు? మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్న ప్రభుత్వానికి సుప్రీం తీర్పు చెంపదెబ్బ వంటిదని రఘునందన్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news