ఏసియన్ గేమ్స్ లో మహిళల క్రికెట్ ఈవెంట్లో టీమిండియా మొట్టమొదటి గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది ఓ రికార్డు సృష్టించింది. శ్రీలంకతో ఇవాళ జరిగిన ఫైనల్ లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది.
కాంస్య పతకం కోసం ఇవాళ జరిగిన మరో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆసియా క్రీడల్లో భారత్ కి ఇవాళ ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ లో భారత్ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలా సాహెబ్ పాటిల్, దివ్యాంస్ సింగ్ పన్వర్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ లతో కూడిన జట్టు భారత్ కి తొలి బంగారు పతకాన్ని అందించింది.