Asia Cup 2022 : గ్రూప్-ఏ లో భాగంగా ఇవాల్టి రెండో మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ ఢీ కొనబోతున్నాయి. ఇదే దుబాయ్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా బాబర్ అజం సేనతో తలపడనుంది. సుదీర్ఘ విరామం అనంతరం ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది.
దీనికోసం రెండు జట్లు సన్నద్ధం అయ్యాయి. నెట్స్ ప్రాక్టీస్ లో చెమటోడ్చాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నాయి. ఈ మ్యాచ్ కు వరుణ దేవుడు అడ్డుపడే అవకాశాలు ఏమాత్రం లేవు. వర్షం పడే సూచనలేవి లేవని దుబాయ్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణం వేడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత కూడా 34 డిగ్రీల మేర రికార్డ్ అవుతుందని పేర్కొంది. రాత్రి 9 గంటల తర్వాత గాలిలో తేమశాతం 34 వరకు ఉండొచ్చు. ఇది లక్ష్యాన్ని చేదించడానికి బ్యాటింగ్ చేసే జట్టు జయాపజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనే అంచనాలు ఉన్నాయి.