విరాట్ కోహ్లీ బయోపిక్ లో లైగర్ !

-

ఆగస్టు 28వ తేదీ ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టి20 మ్యాచ్ అందరినీ ఆకర్షించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. అయితే, ఈ మ్యాచ్ చేజింగ్ లో జడేజా ఆఖరి ఓవర్ మొదటి బంతికి నిష్క్రమించిన తర్వాత, నాలుగో బంతికి సిక్స్ బాది అద్భుత విజయం అందించాడు. అయితే.. ఈ మ్యాచ్‌ కు విజయ్ దేవరకొండ హాజరైన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన అతని లైగర్ చిత్రం ప్రమోషన్స్ కోసం విజయ్ ఈ మ్యాచ్ కూ హాజరై సందడి చేశాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రీ మ్యాచ్ షోలో పాల్గొని రచ్చ చేశాడు.

స్టార్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పటాన్ తో సరదాగా చిట్ చాట్ చేశాడు. ఇక మ్యాచ్ జరుగుతుండగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ లో కామెంటేటర్లతో ముచ్చడించాడు. తెలుగు వ్యాఖ్యాతలకు దుబాయ్ లోని పరిస్థితిని వివరించాడు. కామెంటేటర్లు కళ్యాణ్, ఎమ్మెస్ కే ప్రసాద్ అడిగిన పలు ప్రశ్నలకు విజయ్ దేవరకొండ సమాధానాలు ఇచ్చాడు. కిక్కిరిసిన మైదానంలో మ్యాచ్ చూస్తుంటే ప్రత్యేక అనుభూతి కలుగుతుందని చెప్పిన రౌడీ హీరో జాతీయగీతం వచ్చినప్పుడు రోమాలు నిక్కబడుచుకున్నాయని తెలిపాడు. ఏదైనా క్రికెటర్ బయోపిక్ లో నటించాలని ఉందా? అని కళ్యాణ్ అడగ్గా, విరాట్ అన్న బయోపిక్ చేయాలనుందని చెప్పాడు. కోహ్లీ అంటే తనకు ఇష్టమని, అతని ఆటిట్యూడ్ అంటే పడి చస్తానని తెలిపాడు. రనవీర్ నటించిన కపిల్ బయోపిక్ 83 మూవీలో కృష్ణమాచారి పాత్ర కోసం తనను అడిగారని, కానీ తనకు కుదరలేదని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version