ఆసియా కప్ ఎక్కువసార్లు గెలిచిన జట్టు ఏదో తెలుసా? 

-

Asia Cup: ఈ నెల 27 నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ 2022 జరగనుంది. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక వన్డే జట్లతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ తో పాటు మరో క్వాలిఫైయర్ జట్టు కూడా పాల్గొంటాయి. ఈ ఏడాది జరగబోతున్న ఆసియా కప్ 15వది. అంటే 2018 వరకు 14 టోర్నీలు జరిగాయి. మొదటిసారి ఆసియా కప్ 1984లో జరిగింది. 2016 లో తొలిసారి ఈ టోర్నీ టి20 ఫార్మాట్ లో జరిగింది. అందులో ఇండియా విజేతగా నిలిచింది.

ఆ తర్వాత 2018 లో చివరిసారి వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ జరిగిన సమయంలోను ఇండియానే గెలిచింది. ఈ ఏడాది మరోసారి ఆసియా కప్ టీ 20 ఫార్మాట్ లో జరగబోతోంది. మరో రెండు నెలల్లో టి20 ప్రపంచ కప్ జరుగుతుండటంతో నిర్వాహకులు ఆసియా కప్ టి20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకు ఆసియా కప్ లో భాగంగా 14 టోర్నీలు జరిగాయి. అందులో 7 సార్లు ఇండియానే టైటిల్ సొంతం చేసుకుంది. చివరి రెండు సార్లు కూడా ఇండియానే విజేతగా నిలిచింది. అటు చివరిగా జరిగిన రెండు టోర్నీలో రన్నరప్ బంగ్లాదేశ్ కావడం గమనార్హం. 2012 నుంచి ఆసియాకప్ లో బంగ్లాదేశ్ మూడుసార్లు ఫైనల్ రావడం విశేషం. ఆసియాకప్ చరిత్రలో ఇండియా తర్వాత శ్రీలంక ఐదు సార్లు గెలిచి రెండవ స్థానంలో నిలవగా, పాకిస్తాన్ రెండుసార్లు మాత్రమే ఆసియా కప్ విజేతగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version