ఆస్ట్రేలియా యువ స్టార్ క్రికెటర్ విల్ పుకోవ్ స్కీ ఆటకు వీడ్కోలు పలకడానికి సిద్ధమయ్యారు. వైద్య నిపుణుల సూచనల మేరకు 26 ఏళ్లకే ఈ నిర్ణయం తీసుకోనున్నారు. 2021లో సిడ్నీ వేదికగా భారత్ తో జరిగిన టెస్ట్ తో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన విల్ భవిష్యత్ బ్యాటింగ్ స్టార్ గా దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ గా భారీ అంచనాలను సైతం అందుకున్నాడు.
కానీ కంకషన్ అతని కెరియర్ ముగించింది. విల్ కి వరుసగా తన తలకు గాయాలు అవడంతో అతని కెరీర్ ముగిసిపోయింది. కంకషణతో మ్యాచ్ లకు తరచూ దూరమైన విల్ వైద్య నిపుణుల సూచనలతో తన ఆటకి ముగింపు పలికాలని నిర్ణయం తీసుకున్నాడు. అతని క్రికెట్ కెరీర్ లో ఇప్పటివరకు 13 సార్లు కంకషన్ కు గురికావడం విశేషం. చివరిగా ఈ సంవత్సరం మార్చిలో షేఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లో విల్ హెల్మెట్ కు బంతి బలంగా తాకింది. ఆ తర్వాత కంకషన్ తో సీజన్ మొత్తానికి దూరమైన విల్ తిరిగి మైదానంలో ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. ఇంగ్లాండ్ కౌంటీ జట్టు లీసెస్టర్ షైర్ తో ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నాడు.