IPL 2024: ఇవాళ ఐపీఎల్‌ లో రెండు మ్యాచ్‌ లు..పంత్ కు నో ఛాన్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇందులో మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది.

Axar Patel to lead Delhi Capitals in must-win match against RCB after BCCI suspends Rishabh Pant

ఇందులో రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలిస్తే ప్లే ఆప్స్ కు కచ్చితంగా చేరుతుంది. అదే చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే.. నాలుగవ స్థానంలో సీఎస్కే నిలుస్తుంది. అటు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైట్ జరగనుంది.

ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధిస్తే నాలుగవ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బరిలో ఉంటుంది. అదే బెంగళూరు గెలిస్తే… ఆ జట్టుకు ప్లేయర్ వెళ్లే ఛాన్సులు మెరుగవుతాయి. దీంతో ఇవాళ జరిగే రెండు మ్యాచ్లు చాలా కీలకంగా కానున్నాయి. అయితే ఇవాల్టి మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ పంత్ ఆడటం లేదు. అతనిపై స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడింది. దీంతో పంత్ స్థానంలో అక్షర పటేల్ కెప్టెన్సీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news