బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ముష్ఫికుర్ రహీం 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. షకిబ్ అల్ హసన్ 75 పరుగులు, మహ్మదుల్లా 46 పరుగులు చేసి రాణించడంతో బంగ్లాదేశ్ స్కోరు అమాంతం పెరిగిపోయింది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019లో దక్షిణాఫ్రికా వరుసగా రెండో సారి ఓడిపోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే అది భారీ స్కోరే. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా.. 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 309 పరుగులే చేసింది. దీంతో బంగ్లాదేశ్ విజయం ఖాయమైపోయింది. 21 పరుగుల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్.. ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలో జరిగిన ఐదో మ్యాచ్ ఇది.
బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ముష్ఫికుర్ రహీం 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. షకిబ్ అల్ హసన్ 75 పరుగులు, మహ్మదుల్లా 46 పరుగులు చేసి రాణించడంతో బంగ్లాదేశ్ స్కోరు అమాంతం పెరిగిపోయింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో కెప్టెన్ డుప్లెసిస్ 62 పరుగులు, మార్క్రం 45, వాన్ డర్ డుస్సెన్ 41, జేపీ డుమినీ 45 చేసి జట్టు స్కోరును పెంచినా ఫలితం దక్కలేదు.
One #CWC19 game, one victory for the @bcbtigers.
Watch their winning moment! ? #RiseOfTheTigers pic.twitter.com/pWEV28nTN1— ICC (@ICC) June 2, 2019
The #SpiritOfCricket at #CWC19 ?#ProteaFire #RiseOfTheTigers pic.twitter.com/i04PmQcUeg
— ICC (@ICC) June 2, 2019