ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా ఇవాల సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు కేవలం 179 పరుగులకే కుప్ప కూలింది. ఈ ఛాంపియన్స్ ట్రోపీలో ఇంగ్లండ్ ఇదే అతి తక్కువ స్కోర్ చేయడం గమనార్హం. ఇంగ్లండ్ బ్యాటర్లు డకెట్ 24, స్మిత్ 0, రూట్ 37, హార్రీ బ్రూక్ 19, బట్లర్ 21, లివింగ్ స్టన్ 09, జెమీ ఓవర్టన్ 11, ఆర్చర్ 25, అదిల్ రషీద్ 02, షకీబ్ మహమ్మద్ 05 పరుగులు చేశారు.
సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 03, మడర్ 03, కేశవ్ మహరాజ్ 2, ఎంగిడి, రబాడ చెరో వికెట్ తీసుకున్నారు. 38.2 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 179 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ రిక్లెటన్ 27, స్టబ్స్ డకౌట్ అయ్యాడు. వాండర్ డసెన్ 72, క్లాసెన్ 64 కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరిలో డేవిడ్ మిల్లర్ (07) సిక్స్ తో ఫినిషింగ్ చేశాడు. దీంతో 29.1 ఓవర్లలోనే 181 పరుగులు చేశారు. దీంతో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది.