భారత్ ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అందులో భాగంగా విండీస్‌తో భారత్ 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అందుకు గాను బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ ముగిసింది.. ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచింది.. ఇక ఆయా దేశాల క్రికెట్ జట్లన్నీ తమ సొంత టూర్లతో బిజి బిజీగా మారనున్నాయి. ఈ క్రమంలోనే భారత్ కూడా ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అందులో భాగంగా విండీస్‌తో భారత్ 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అందుకు గాను ఇవాళ బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. వెస్టిండీస్ టూర్‌కు వెళ్లనున్న భారత టీ20, వన్డే, టెస్టు జట్లను బీసీసీఐ కొంత సేపటి క్రితమే ప్రకటించింది. ఈ క్రమంలో విండీస్ టూర్‌కు వెళ్లనున్న భారత జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవ్‌దీప్ సైనీ.
వన్డే జట్టు:
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, కేదార్ జాదవ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నవ్‌దీప్ సైనీ.
టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానె(వైస్‌కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, పుజారా, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్.
కాగా ముందుగా అనుకున్నట్లుగానే భారత జట్టు వికెట్ కీపర్ ధోనీకి విండీస్ టూర్ నుంచి రెస్ట్ ఇచ్చారు. ధోనీ ముందే సెలెక్టర్లను విశ్రాంతి కోరిన నేపథ్యంలో ధోనీని ఈ టూర్‌కు ఎంపిక చేయలేదు. ఇక వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గాయపడ్డ శిఖర్ ధావన్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించడంతో అతనికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ధావన్ విండీస్‌తో జరిగే టీ20, వన్డే మ్యాచ్‌లలో ఆడనున్నాడు. ఇక వీరే కాకుండా.. పలువురు కొత్త ప్లేయర్లకు కూడా ఈ టూర్‌లో అవకాశం కల్పించారు.