పాక్ మ్యాచ్ పై సోషల్ మీడియా లో క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

-

వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. ఆదివారం చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయ ఢంకా మోగించింది. అక్టోబర్ 11న ఢిల్లీలో అప్గనిస్తాన్ తో రోహిత్ సేన తలపడనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదులు, భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కి భారత్ సరికొత్త జెర్సీతో బరిలోకి దిగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలపై తాజాగా బీసీసీఐ స్పందించింది. తాజాగా సోషల్ మీడియాలో వచ్చే కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత జట్టు బ్లూ జెర్సీతో మ్యాచ్ లను ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రాక్టీస్ సందర్భంగా డచ్ ఆరేంజ్ రంగులోని జెర్సీనీ ఆటగాళ్లు ధరిస్తున్నారు. పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా ఇదే జెర్సీతో భారత్ బరిలోకి దిగుతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు బీసీసీఐ కి చేరాయి. తాజాగా వాటిపై బీసీసీఐ అధికారికంగా స్పందించింది. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది.

Read more RELATED
Recommended to you

Latest news