చంద్రబాబు కేసులో సిఐడి లాయర్లకు షాకిచ్చిన ACB కోర్ట్ !

-

స్కిల్ స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరపున హై కోర్ట్ లో వేసిన బెయిల్ పిటీషన్ పై ఈ రోజు తీపు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ తీర్పులో భాగంగా చంద్రబాబుకు బెయిల్ ను కోర్ట్ నిరాకరించింది, అంతే కాకుండా సిఐడి తరపున వాదించిన లాయర్ లకు ఏసీబీ కోర్ట్ షాక్ ఇచ్చింది. చంద్రబాబును కస్టడీ కి ఇవ్వాలని విన్నవించగా, చంద్రబాబు తరపున లాయర్ల వాదనతో ఏసీబీ కోర్ట్ ఏకీభవించి కస్టడీ కి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దీనితో సిఐడి కి షాక్ ఇచ్చినట్లయింది ఏసీబీ కోర్ట్, మరి ఇప్పుడు ఇరు వర్గాల లాయర్లు ఏ విధమైన స్టెప్ తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు కు బెయిల్ రాకపోవడంతో అక్టోబర్ 20 వరకు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉండనున్నారు.

మరి రిమాండ్ ముగిసే లోపు కోర్టులు ఏ విధమైన ఆదేశాలను ఇవ్వనున్నాయి అన్నది తేలియాలనంటే మరో పది రోజులు ఎదురు చూడవలసిందే.

Read more RELATED
Recommended to you

Latest news