ఐపీఎల్ లో క్లాసెన్, కోహ్లీకి భారీ ధర

-

ఐపీఎల్ 2025కి సంబంధించి ఆయా జట్లు తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను విడుదల చేశాయి. వారిలో ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గత ఐపీఎల్ సీజన్ లో చెలరేగిన ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. వారిలో అత్యధికంగా క్లాసెన్ రూ.23 కోట్లు చెల్లించనుంది. అన్ని టీమ్ లతో పోల్చితే అత్యధిక ధర క్లాసెన్ కే కావడం విశేషం. కెప్టెన్ కమిన్స్ కి రూ.18కోట్లు, అభిషేక్ శర్మ 14కోట్లు, నితీష్ రెడ్డి రూ.6కోట్లు, ట్రావిస్ హెడ్ కి రూ.14కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది.

అదేవిధంగా ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించింది. రజత్ పాటిదార్ కు రూ.11కోట్లు, యశ్ దయాల్ కి రూ.5కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది. శశాంక్ సింగ్ కు పంజాబ్ 5.5 కోట్లు, ఎల్ఎస్జీ రూ.21కోట్లకు నికోలస్ పూరన్ ను రిటైన్ చేసుకుంది. మరోవైపు చెన్నై జట్టు 5గురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ రూ.18కోట్లు, జడేజాకు రూ.18కోట్లు, ధోనికి రూ.4కోట్లు(అన్ క్యాప్ డ్ ప్లేయర్) వెచ్చించి అట్టిపెట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్ కి రూ.18కోట్లు, శుభ్ మన్ గిల్ 16.5 కోట్లు,  రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజూ శాంసన్ కి రూ.18కోట్లతో పాటు యశస్వీ జైస్వాల్ రూ.18కోట్లతో రిటైన్ చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version