శ్రీలంక స్టార్ క్రికెటర్ చమిక కరుణరత్నే క్యాచ్ అందుకునే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. హై క్యాచ్ పట్టే క్రమంలో కరుణ రత్నే మూతిపళ్ళు రాలగొట్టుకున్నాడు. గాలే గ్లాడియేటర్స్, కెండి ఫాల్కన్స్ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాలే గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా కార్లెస్ బ్రాత్ వైట్ బౌలింగ్ లో ఫెర్నాండో భారీ షాటుకు ప్రయత్నించగా, మిస్ టైమ్ అయిన బంతి గాల్లోకి లేచింది.
చాలా హైగా వచ్చిన ఈ క్యాచ్ ను అందుకునేందుకు పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న కరున రత్నే పరుగెత్తాడు. క్యాచ్ కోసం సహచరులను వారించి మరీ వెనక్కి పరిగెత్తుకొచ్చిన కరుణ రత్నే బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయాడు. దాంతో కోకోబురా బాల్ నేరుగా వచ్చి అతని మూతికి బలంగా తాకింది. దాంతో అతని ముందు పళ్ళు నాలుగు ఊడి రక్తం కారింది. పళ్ళు రాలిన, కరుణ రత్నే క్యాచ్ మాత్రం వదల్లేదు. బంతిని అందుకొని పక్కనే వచ్చిన సహచరుడికి ఇచ్చి మూతిని పట్టుకొని నొప్పితో డగౌట్ చేరాడు. ఫిజియో సూచనలతో కరుణరత్నేను ఆసుపత్రికి తరలించగా, నాలుగు పళ్ళు ఊడిపోయాయని, సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు లంక క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు.
Chamika Karunaratne lost 3-4 teeth while taking this catch. pic.twitter.com/cvB44921yZ
— Johns. (@CricCrazyJohns) December 8, 2022