IPL 2023 : ఇవాళ ఐపీఎల్ రెండు మ్యాచ్ లు..జట్ల వివరాలు ఇవే

-

ఇవాళ ఐపీఎల్ లో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ మధ్యాహ్నం 3:30 గంటలకు తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై… రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ తో పోరుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్లో ముంబై ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. సూపర్ ఫామ్ లో ఉన్న రాజస్థాన్ నిలకడగా రాణిస్తోంది.

కాగా, నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో SRH 9 రన్స్ తేడాతో విజయం సాధించింది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ… ఆరంభంలోనే వార్నర్ డకౌట్ అయినా సాల్ట్(59), మార్ష్(63) రాణించారు. వీరు కీలక సమయంలో అవుట్ అవ్వడంతో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ ఒత్తిడికి లోనై వెంట వెంటనే అవుట్ అయ్యారు. చివర్లో అక్షర్ ( 29) పోరాడిన DC 188/6కే పరిమితమైంది. SRH బౌలర్లలో మార్కండే 2, అభిషేక్, భువీ, హోస్సేన్, నటరాజన్ తలో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version