ఐసీసీ ప్రవేశపెట్టిన అవార్డులలో ప్రతి నెలకు గాను ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి బహూకరించడం జరుగుతూ వచ్చింది. సెప్టెంబర్ నెలకు గాను ఇండియా క్రికెటర్ శుబ్ మాన్ గిల్ ను ఈ అవార్డు వరించింది. ఇప్పుడు అక్టోబర్ నెలకు గాను అవార్డు కు పోటీలో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు. వారిలో సౌత్ ఆఫ్రికా కు చెందిన డి కాక్ 431 పరుగులు చేయగా, న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర 406 పరుగులు మరియు ఇండియా స్పీడ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 14 వికెట్లు పడగొట్టి రేస్ లో ఉన్నారు. అక్టోబర్ లోనే వరల్డ్ కప్ స్టార్ట్ అవడంతో వీరు ముగ్గురూ ఆ నెలకు గాను బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగంలో రాణించారు. మరి వీరి ముగ్గురిలో ఎవరికి ఈ అవార్డు దక్కుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇండియా తరపున బుమ్రా కు కనుక ఈ అవార్డు వస్తే వరుసగా రెండు నెలలు మనకే ఈ ఘనత దక్కినట్లు అవుతుంది.
డి కాక్ మరియు రవీంద్ర లు కూడా ఆసాధారణమైన ప్రదర్శన చేశారు. కానీ మొదటి సారి వరల్డ్ కప్ ఆడిన రవీంద్ర బ్యాటింగ్ లో అద్బుతమగా రాణించిడంతో అతనికే ఈ అవార్డు దక్కుతుందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.