జగన్ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగి పోయేవరకు ప్రజలేవరు ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకోవద్దని రఘురామకృష్ణ రాజు కోరారు. డాక్యుమెంట్ ఉన్నా, డాక్యుమెంట్ ఇవ్వని వ్యవస్థను తీసుకువచ్చి దాన్ని మోడ్రన్ వ్యవస్థగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆస్తి నీది పేపర్ నాది అనే కాన్సెప్ట్ తో జీవో ఇచ్చారని, రిజిస్ట్రేషన్ స్టాంపులు కొనుగోలు చేయడానికి ఇబ్బంది అవుతుందని, ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చలాన్ కట్టేస్తే, రిజిస్ట్రేషన్ అయిపోయిందని స్లిప్పు ఇస్తారని అన్నారు.
ప్రాపర్టీ అంటే సానిటీ ఉండాలని, దేశం అంతా నడిచే సిస్టం కాదని, ఇటువంటి తింగరి పనులు చేస్తే సామాన్యులు ఇబ్బందులు పడతారన్నారు. గవర్నమెంట్ సిస్టంలో ఎవరైనా హ్యాక్ చేసి ఆస్తి పత్రాలను డౌన్లోడ్ చేసుకొని అమ్మితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ విధానం వల్ల బ్యాంకర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్, తాలూకా ఆఫీసును తాకట్టు పెట్టి, అప్పు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు, రేపు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టారన్న గ్యారంటీ ఏమిటి? అని ప్రశ్నించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ పేరిట 40 నుంచి 45 వేల కోట్ల అప్పులు ఉన్నాయని, ఈ విషయం తప్పయితే సివిల్ సప్లై శాఖ పేరిట ఎటువంటి అప్పులు లేవని సంబంధిత శాఖ మంత్రి, లేదంటే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలంటూ బహిరంగా సవాల్ చేస్తున్నానని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.