చెన్నై సూపర్ కింగ్స్ కు 2022 సీజన్ అస్సలు అచ్చి రావడంలేదు. వరుసగా ఓటములతో సతమతమౌవుతోంది. ఈ నేపథ్యంలోనే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ఐపీఎల్ 2022 కు పూర్తిగా దూరం కానున్నాడు. వెన్నుముక గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
ఫిబ్రవరిఓ వెస్టిండీస్ తో టీ 20 మ్యాచ్ సమయంలో.. చాహార్ కు తొడ కండరాల గాయం అయింది. నెల రోజులకు పైగా బెంగళూరు లోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్న చాహర్ కు వెన్ను గాయమైనట్లు ఎన్సీఏ వర్గాలు తెలిపాయి. దీంతో ఏప్రిల్ రెండో వారానికి కల్లా ఐపీఎల్ లోకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరతాడని భావించిన దీపక్ చాహర్.. 2022 సీజన్ నుంచి మొత్తానికి దూరమయ్యాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ చాహర్ ప్రస్తుతం బెంగళూరు లోని ఎన్సీఏలో చికిత్స పొందుతున్నాడు.