ఐపీఎల్ 2022 సీజన్ లో బుధ వారం ముంబై ఇండియన్స్, కోల్‌కత్త నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుపై కోల్‌కత్త నైట్ రైడర్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఐపీఎల్ ప్రవర్తన నిబంధనలను ఉల్లఘించినందుకు కోల్‌కత్త నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు.. నితీష్ రానాకు ఐపీఎల్ నిర్వహకులు భారీ జరిమానా విధించారు. నితీష్ రానా చేసిన తప్పు అంగీకరించడంతో మ్యాచ్ ఫీజు లో 10 శాతం కోత విధించారు.
అలాగే ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఐపీఎల్ ప్రవర్తన నియమాలను ఉల్లంఘించాడని తెలుస్తుంది. బుమ్రా కూడా తాను చేసిన తప్పును అంగీకరించాడు. దీంతో ఇతనిపై ఐపీఎల్ నిర్వహకులు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. కాగ వీరికి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 అఫెన్స్ ప్రకారం మ్యాచ్ రిఫరీ యే జరిమానా, వార్నింగ్ ఇచ్చారు. తప్పు అంగీకరించకపోతే.. వీరిపై ఒక మ్యాచ్ బ్యాన్ పడేది. అయితే నితీష్ రానా, జస్ప్రీత్ బుమ్రా ఎలాంటి నియమాలను ఉల్లంఘించారో తెలియాల్సి ఉంది.