ఐపీఎల్ 2023 షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ లు ధర్మశాల వేదికగా తలపడుతున్నాయి. ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్ మరియు ప్లే ఆఫ్ కు వెళ్ళడానికి ఇదే చివరి ఆశ కావడం వలన గెలుపే ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగాయి. రెండు జట్లు కూడా ఆడిన 13 మ్యాచ్ లలో 6 మ్యాచ్ లు గెలిచి 12 పాయింట్ లతో సమానంగా ఉన్నా నెట్ రన్ రేట్ తేడా ఉండడంతో రాజస్థాన్ మరియు పంజాబ్ లు వరుసగా 6 , 8 స్థానాలలో ఉన్నాయి. ఈ రోజు మ్యాచ్ లో గెలిస్తేనే కనీసం ఆఖరి మ్యాచ్ ముగిసే వరకు ప్లే ఆఫ్ మీద ఆశలు ఉంటాయి. కాగా ఈ రోజు మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.