బీజేపీ.. కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు రాజేస్తోంది : కూనంనేని

-

శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. వారు కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు రేపుతున్న బీజేపీ కి తెలంగాణలో అసలు చోటు లేదని పేర్కొన్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ కి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సంసిద్ధులై ఉన్నారని అన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు తొత్తులుగా మారి దేశ సంపదనంతా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమయ్యేలా నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశ ప్రజలను రక్షించుకునేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలన్నీఒకటవ్వాలని పేర్కొన్నారు. అడిగే వారి పై అక్రమ కేసులు పెట్టి వేధించడం నరేంద్ర మోదీకి పరిపాటిగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాముని పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు కూనంనేని. సీఎం కేసీఆర్‌ బీజేపీపై చేస్తున్న యుద్ధానికి తామంత సహకారం అందిస్తామని వెల్లడించారు ఆయన. బొగ్గుగనులను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని అన్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకుండా రాష్ట్రాలన్నింటినీ ఇబ్బందులుపెడుతూ పరిపాలన సాగించకుండా మోకాలడ్డుతోందన్నారు. విభజన చట్టంలోని హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు కూనంనేని.

Read more RELATED
Recommended to you

Exit mobile version