కోల్కతా నైట్రైడర్స్ 2024 ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో సన్రైజర్స్పై 8 వికెట్ల తేడాతో నెగ్గి, మూడో టైటిల్ కొట్టేసింది. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఈ క్రమంలో ఐపీఎల్ టైటిల్ సాధించిన 8వ కెప్టెన్గా అయ్యర్ రికార్డులకెక్కాడు. దాదాపు 10ఏళ్లుగా సాధించలేకపోతున్న ట్రోఫీ కలను నిజం చేశాడు. తాజా విజయంతో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు, టైటిల్ నెగ్గిన కెప్టెన్గా రోహిత్తో సమానంగా నిలిచాడు. రోహిత్ శర్మ (ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు 2009లో), టైటిల్ (2013లో తొలి టైటిల్) సాధించిన రికార్డు కొట్టాడు. దీన్ని తాజాగా అయ్యర్ అందుకున్నాడు.
ఐపీఎల్లో మూడో టైటిల్ గెలిచిన సంబురాలను కోల్‌కతా ఆటగాళ్లు ఆస్వాదిస్తున్నారు. కెప్టెన్ శ్రేయస్ కూడా సెలబ్రేషన్స్లో మునిగిపోయాడు. టైటిల్ పట్టుకొని హోటల్ రూమ్లో డ్యాన్స్ చేశాడు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్స్ రూమ్‌లో కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వీడియోను కేకేఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. సునీల్ నరైన్, ఆండ్రి రస్సెల్ డ్యాన్స్‌లు.. శ్రేయస్ అయ్యర్ కప్‌తో సరదా స్టెప్పులు వేయడం ఆకట్టుకుంది. ఆ వీడియోను మీరూ చూసేయండి..
https://x.com/CricCrazyJohns/status/1794902202764738913