ఈ ఏడాది ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జాయింట్స్, గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్ ను ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో హర్ధిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ భారీ విక్టరీని నమోదు చేసింది. కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జాయింట్స్ నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ బ్యాట్స్ మెన్లు ఛేదించారు. దీంతో గుజరాత్ తమ తొలి మ్యాచ్ లోనే విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో ఓపెనర్ శుభమాన్ గిల్ (0) విఫలం అయ్యాడు. మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ (30) రాణించాడు. అలాగే ఆల్ రౌండర్ విజయ్ శంకర్ (4) కే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ హర్ధిక్ పాండ్య (33), డేవిడ్ మిల్లర్ (30) రాణించారు. వీరికి రాహుల్ తెవాటీయా.. కేవలం 24 బంతుల్లోనే 40 పరుగుల చేసి నాటౌట్ గా నలిచాడు.
అందులో 5 ఫోర్లు, 2 సిక్స్ లు కూడా ఉన్నాయి. అభినవ్ మనోహార్ (15 నాటౌట్) తో కలిసి రాహుల్ తెవటీయా మ్యాచ్ ను ముగించాడు. ఈ మ్యచ్ లో గుజరాత్ బౌలర్ మహ్మద్ షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.