ఆర్సీబీకి షాక్.. ఐపీఎల్ 2022కు మ్యాక్స్‌వేల్ దూరం!

-

ఐపీఎల్ 2022కు బీసీసీఐ స‌ర్వం సిద్ధం చేస్తుంది. ఇటీవ‌లే మెగా వేలం కూడా ముగిసింది. అతి త్వ‌ర‌లోనే ఈ క్యాష్ లీగ్ ప్రారంభం కానుంది. కాగ ఐపీఎల్ 2022 కు ముందు రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్టుకు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. కోట్ల రూపాయ‌ల‌తో రిటైన్ చేసుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండ‌ర్.. గ్లెన్ మ్యాక్స్ వేల్ ఈ ఏడాది ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నాడ‌ని తెలుస్తుంది. కాగ మ్యాక్స్ వేల్.. త‌మిళ సంత‌తికి చింద‌న యువ‌తిని త్వ‌ర‌లో వివాహం చేసుకునేందుకు సిద్దం అవుతున్నాడు.

ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించి శుభ‌లేఖ‌లు కూడా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అంతే కాకుండా మ్యాక్స్ వేల్.. ఆసీస్ – పాక్ సిరీస్ కు కూడా దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అలాగే ఐపీఎల్ కు కూడా దూరంగా ఉంటున్నాడ‌ని సమాచారం. అయితే ఈ ఏడాది మార్చి చివ‌రి వారంలో ఐపీఎల్ ను నిర్వ‌హించ‌డానికి బీసీసీఐ సిద్ధం అవుతుంది. కాగ మ్యాక్స్ వేల్ పూర్తి టోర్నీకి దూరం అవుతుండ‌గా.. డేవిడ్ వార్న‌ర్, మిచెల్ మార్ష్, మార్క‌స్ స్టోయినీస్, పాట్ క‌మిన్స్ కూడా ఐపీఎల్ ప్రారంభం మ్యాచ్ ల‌కు అందుబాటులో ఉండ‌టం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version