ఐపీఎల్ వదిలి లంకకు వచ్చేయాలి..శ్రీలంక మాజీ ప్లేయర్ వార్నింగ్

-

ఐపీఎల్ లో ఆడుతున్న శ్రీలంక క్రికెటర్లు వారం రోజుల్లోగా తమ దేశానికి వచ్చేయాలని సూచించారు ఆ దేశ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు అర్జున రణతుంగ.ప్రజలు ఇక్కడ ఆకలితో చేస్తుంటే మీకు ఐపీఎల్ కావాల్సి వచ్చిందా! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రణతుంగ.శ్రీలంకలో నెలకొన్న ఆర్థికక సంక్షోభం ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది.రోజురోజుకీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి బంగాళా ఖాతం లోతు కన్నా అడుగంటి పోతోంది.మరోవైపు ప్రజలుు ఆందోళనలు, నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.ఈ పరిస్థితులను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టక పోగా మమ్మల్ని ఆదుకోండి మహా ప్రభో అని రోడ్ల మీదకు వచ్చిన ప్రజలపై ఉక్కుపాదం మోపాలని చూస్తోంది.

ఈ నేపథ్యంలో దేశమంతా నిరసనకారులకు మద్దతు తెలుపుతుంది.అయితే ఒక వైపు ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే, కొంతమంది క్రికెటర్లు క్రికెటర్లు మాత్రం డబ్బులకు ఆశపడి ఐపీల్ లో ఆడుతున్నారని అదేేశ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు  అర్జున అర్జున రణతుంగ తీవ్రంగా విమర్శలు చేశారు.ఐపీఎల్ లో ఆడుతున్న శ్రీలంక క్రికెటర్లు వారం రోజుల్లోగా తమ దేశానికి వచ్చేయాలని రణతుంగ కోరారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ కాంట్రాక్టులు పోతాయన్న భయం తో క్రికెటర్లు స్పందించకపోవడం పై రణతుంగ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version