ఓ వైపు దేశంలో కరోనా విజ్రుంభిస్తున్న వేళ మరో వైపు ఐపీఎల్ మ్యాచ్లు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ నువ్వా నేనా అని ఉత్కంఠగా సాగుతున్నాయి. కాగా ఆడిన తొలి రెండు మ్యాచ్ లలో సన్రైజర్స్ ఓటమి పాలైన విషయం తెల్సిందే. అయితే శనివారం సన్రైజర్స్ హైదరాబాద్ పటిష్ట ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. కాగా ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ 2016 చరిత్రను రిపీట్ చేస్తుందా..? అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇంతకి ఎంటా 2016 చరిత్ర అంటే… 2016లో జరిగిన ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్ గా అవరతరించిన విషయం తెల్సిందే. అయితే ఆ టోర్నీలో సన్రైజర్స్ ఆడిన తొలి రెండు మ్యాచ్ ఓడిపోయింది. ఆ రెండు మ్యాచ్ లు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ కావడం గమనార్హం. అయితే ఆ ఏడాది మూడో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలపడిన సన్రైజర్స్ విజేతగా నిలిచింది. అయితే ఈ ఏడాది కూడా ఆడిన తొలి రెండు మ్యాచ్ లలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. ఆ రెండు మ్యాచ్ లు కూడా 2016 మాదిరి బెంగళూరు, కోల్కతాలపైనే కావడం విశేషం. అయితే శనివారం ముంబైతో జరిగే మ్యాచ్ లో సన్రైజర్స్ గెలిచి … 2016 చరిత్రను రిపీట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.