శుక్రవారం జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. 165పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుని సన్ రైజర్స్ బౌలర్లు బాగానే కట్టడి చేయగలిగారు. ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా గెలుస్తుందేమో అన్నంతగా అనిపించారు. కానీ చివరికి ఏడు పరుగుల తేడాతో ఓడిపోయారు. ఐతే చివరి రెండు ఓవర్లలో ధోనీ కొంత తడబడ్డాడు. ,మ్యాచు ఆడుతున్నప్పుడు కొంత ఇబ్బందికి గురయ్యి దగ్గుతూ కనిపించాడు.
ధోనీ లాంటి ఆటగాడు ఆటలో అలా ఇబ్బంది పడుతూ ఇంతవరకూ చూడని ప్రేక్షకులు ధోనీ కి ఏమైందబ్బా ఆశ్చర్యపోయారు. ఐతే చివరి రెండు ఓవర్లలో ధోనీ అలా ఇబ్బంది పడడానికి కారణాన్ని వివరించాడు. ముందుగా ఐపీఎల్ జరుగుతున్నది దుబాయ్ లో అన్న సంగతి మరిచిపోకూడదు. అక్కడ ఉండే వేడిలో ఆట ఆడడం ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఐతే చివరి ఓవర్లో గొంతు ఎండిపోవడం వలన దగ్గు వచ్చిందట. ఎక్కువగా ఉమ్డే ఉష్ణోగ్రత వల్ల గొంతు తడారిపోతుంది. సన్ రైజర్స్ తో మ్యాచులో ధోనీకి ఇలాగే జరిగిందట. అందువల్లే కొంత ఇబ్బందిగా మారిందని చెప్పుకొచ్చాడు.