బాక్సింగ్ డే టెస్ట్‌.. జ‌డేజా అద్భుత‌మైన క్యాచ్‌..

-

బార్డ‌ర్ గ‌వాస్క‌ర్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియాల మ‌ధ్య మెల్‌బోర్న్‌లో రెండో టెస్టు మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 72.3 ఓవ‌ర్ల‌లో 195 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. బుమ్రా 4 వికెట్లు తీయ‌గా, అశ్విన్ కు 3, సిరాజ్‌కు 2, జ‌డేజాకు 1 వికెట్ ద‌క్కాయి.

కాగా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ర‌వీంద్ర జ‌డేజా అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టాడు. ఆసీస్ ప్లేయ‌ర్ మాథ్యూ వేడ్ బంతిని గాల్లోకి త‌ర‌లించ‌గా దాన్ని అందుకునేందుకు జ‌డేజా, శుబ్‌మ‌న్ గిల్‌లు ప‌రుగెత్తారు. అయితే జ‌డేజా తాను క్యాచ్ ప‌డ‌తాన‌ని సైగ చేశాడు. అయిన‌ప్ప‌టికీ గిల్ అత‌ని వెనుకే ప‌రుగెత్తాడు. అయితే చివ‌ర‌కు జ‌డేజానే క్యాచ్ ప‌ట్టాడు. కానీ గిల్ జ‌డేజాను ఢీకొని కింద ప‌డ్డాడు. నేను క్యాచ్ ప‌డ‌తాన‌ని చెప్పాగా.. అంటూ జ‌డేజా క్యాచ్ అనంత‌రం గిల్‌తో సంభాషించాడు. కాగా జ‌డేజా ప‌ట్టిన ఆ సూప‌ర్ క్యాచ్ తాలూకు వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

ఇక తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 11 ఓవ‌ర్ల‌లో 1 వికెట్ కోల్పోయి 36 ప‌రుగుల స్కోరు వ‌ద్ద కొన‌సాగుతోంది. గిల్ 28 ప‌రుగుల‌తో, పుజారాతో 7 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ మ‌ళ్లీ విఫ‌లం అయ్యాడు. 6 బంతులు ఆడిన మ‌యాంక్ తొలి ఓవ‌ర్‌లో స్టార్క్ బౌలింగ్‌లో ప‌రుగులు ఏమీ చేయ‌కుండానే ఎల్బీగా వెనుదిరిగాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version