స్టార్ హిరోయిన్ తో కెఎల్ రాహుల్ త్వ‌ర‌లోనే పెళ్లి..!

-

సెల‌బ్రెటీలు వ‌రుస‌గా పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో న‌టీ నటులు ఎక్కువ‌గా పెళ్లీలు చేసుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం క‌త్రినా కైఫ్ – విక్కీ కౌశ‌ల్ జంట ఒక్క‌టి కాగ‌.. ఇటీవ‌ల ఆలియా భ‌ట్ – ర‌ణ‌బీర్ సింగ్ పెళ్లి పీట‌లు ఎక్కారు. ఇప్పుడు మ‌రో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వివాహం చేసుకోవ‌డానికి సిద్ధం అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్ లోనే హీరో హీరోయిన్లు వివాహం చేసుకోగా.. ఇప్పుడు సినీ రంగం – క్రికెట్ రంగానికి చెందిన ప్ర‌ముఖ వ్య‌క్తులు పెళ్లి కి రెడీ అవుతున్నారు.

టీమిండియా స్టార్ ఆట‌గాడు.. కెఎల్ రాహుల్.. బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె హీరోయిన్ అతియా శెట్టి ల‌వ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ల‌వ్ బ‌ర్డ్స్ గ‌త కొద్ది రోజుల నుంచి చ‌ట్టా ప‌ట్టాలు వేసుకుని తెగ షీకార్లు కొడుతున్నారు. వీరి ప్రేమ గురించి అటు బాలీవుడ్ లో ఇటు క్రికెట్ రంగంలో అంద‌రికీ తెలుసు.

అయితే ప్రేమ‌యాణానికి ఇరు కుటుంబాలు కూడా అంగీక‌రించాయ‌ని తెలుస్తుంది. అంతే కాకుండా త్వ‌ర‌లోనే ఈ ల‌వ్ బ‌ర్డ్స్ ఒక్క‌టికాబోతున్నార‌ట‌. ఇద్ద‌రు కూడా క‌ర్ణాట‌కకు చెందిన వారే కావ‌డంతో క‌ర్ణాట‌క సాంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో వివాహం జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. పెళ్లీ డేట్ ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news