కెప్టెన్ గా ధోని, విరాట్ ల రికార్డును చెరిపేసిన రోహిత్

రోహిత్ శ‌ర్మ‌ టీ ట్వంటి ల‌కు కెప్టెన్ గా వ్య‌వ‌హరించిన కొన్ని రోజుల కే అరుదైన రికార్డు ను సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా మాజీ కెప్టెన్ మిస్ట‌ర్ కూల్ ధోని తో పాటు విరాట్ కోహ్లి ల రికార్డు ల‌ను సొంతం రోహిత్ శ‌ర్మ బ్రేక్ చేశాడు. అంత‌ర్జాతీయ టీ ట్వంటి మ్యాచ్ ల‌లో ఎక్కువ సార్లు ప్ర‌త్య‌ర్థిని క్లీన్ స్వీప్ చేసిన భార‌త‌ కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ రికార్డు సృష్టించాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా వ్యవ‌హిరిస్తూ.. మొత్తం మూడు సార్లు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు పై క్లీన్ స్వీప్ చేశాడు. మొద‌టి సారి శ్రీ‌లంక జ‌ట్టు ను 2017 లో రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. అలాగే వెస్టిండిస్ జట్టు ను 2018 లో వైట్ వాష్ చేశాడు. తాజాగా 2021 లో న్యూజిలాండ్ ను క్లీన్ స్వీప్ చేశాడు. అయితే మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని కేవ‌లం ఒకే సారి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును క్వీన్ స్వీప్ చేశాడు. అలాగే విరాట్ కోహ్లి రెండు సార్లు ప్ర‌త్య‌ర్థిని వైట్ వాష్ చేశాడు. కాగ ఇటీవ‌లే భార‌త టీ ట్వంటి జట్టు కు రోహిత్ శ‌ర్మ పూర్తి కాలం కెప్టెన్ గా బాధ్య‌త‌లు తీసుకున్నాడు.