ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ కు అర్హత సాధించిన పది జట్లలో ఆఫ్గనిస్తాన్ మరియు నెదర్లాండ్ లు కొంచెం చిన్న జట్లు అని చెప్పాలి. కానీ ఈ రెండు జట్లలో గెలవాలన్న కసి టన్నులు టన్నులు ఉన్నా ఎందుకో కీలక సమయంలో అనుభవం లేకపోవడం వలన ఓటమి పాలవుతున్నాయి. ఇక ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు మూడు సంచలనాలు నమోదు అయ్యాయి.. వాటిలో ఒకటి నెదర్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికా ను ఓడించింది, ఇది ఎంత సంచలనముగా మారిందో తెలిసిందే. ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికాకు ఉన్న బ్యాటింగ్ లైన్ అప్ ఎవరికీ లేదనే చెప్పాలి. కానీ వారినే తోకముడిచేలా చేశారు నెదర్లాండ్ బౌలర్లు. ఆ తర్వాత ఆఫ్గనిస్తాన్ డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఓడించి మరో సంచలనం వరల్డ్ కప్ లో నమోదు అయ్యేలా చేసింది.
ఈ రెండింటినీ మరిచిపోకముందే మాజీ వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన పాకిస్తాన్ ను ఆఫ్గనిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఓడించి అద్భుతమే చేసింది. ఈ ఫలితాలతో నెదర్లాండ్ మరియు ఆఫ్గనిస్తాన్ లకు ఈ వరల్డ్ కప్ బెస్ట్ అని చెప్పాలి.