Cristiano Ronaldo: ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతనికి విపరీతంగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రోనాల్డోను ఎంతోమంది ఇష్టపడతారు. తనదైన ఆటతీరుతో రోనాల్డో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఇదిలా ఉండగా…. క్రిస్టియానో రోనాల్డో చివరికి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ జార్జినా రోడ్రీగ్జ్ ను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జార్జినా ఈ విషయాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంది.
తన చేతికి ఉన్న డైమండ్ రింగ్ ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. 2016 నుంచి సహజీవనం చేస్తున్న వీరు చివరికి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రోనాల్డోకు జార్జినాతో కలిసి ఇద్దరు, సరోగసి ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియాలో అల్-నసర్ క్లబ్ తరఫున ఆట ఆడుతున్నాడు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా రోనాల్డో, జార్జినాకు వారి అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.