టీమిండియాతో రెండో టెస్ట్ సందర్భంగా ఆసీస్ జట్టు కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ మిగతా మ్యాచ్ లకు దూరం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ సందర్భంగా సిరాజ్ వేసిన షార్ట్ పిచ్ బంతి వార్నర్ తలకు బలంగా తాకింది.
అయినా అతడు అలాగే బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు ఓపెనర్ డేవిడ్ వార్నర్. అయితే, టీమిండియా బ్యాటింగ్ సమయంలో.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం ఫీల్డింగ్ కు రాలేదు. వార్నర్ స్థానంలో రేన్ షా ఫీల్డింగ్ చేశాడు. దీంతో వార్నర్ కు గాయం అయినట్లు తేలింది. ఇక మూడో టెస్ట్ కు కూడా ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం కానున్నాడు.