అంత సీన్ లేదు.. జ్యోతికపై కంగనా హాట్ కామెంట్స్ వైరల్..!

-

ఫైర్ బ్రాండ్ అనగానే వెంటనే గుర్తొచ్చేది కంగనా రనౌత్.. ఆమెకు నచ్చిన విషయాలను ఎంత అందంగా చెబుతుందో అలాగే నచ్చని విషయాలను అంతే స్ట్రాంగ్ గా వ్యక్తపరుస్తూ ఉంటుంది. తాజాగా సూర్య భార్య, ప్రముఖ హీరోయిన్ జ్యోతిక ఫై పలు సంచలన కామెంట్లు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి కంగనా రనౌత్ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే తనకు నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తుంది.. లేకపోతే వారిని తొక్కేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు .. ముఖ్యంగా నటిగా గొప్ప పేరు ,అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకున్న కంగనా సినిమాలు లేనప్పుడు ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది..

ఈ క్రమంలోని జ్యోతికపై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి… ఇటీవల కాలంలో కంగనా సౌత్ మూవీలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే చంద్రముఖి 2 లో కూడా అవకాశం దక్కించుకుంది. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ జ్యోతిక గురించి కామెంట్లు చేసింది. జ్యోతిక నటించిన చంద్రముఖి మొదటి భాగం 2005లో రిలీజ్ అయ్యి… భయపెట్టిన విషయం తెలిసిందే..

కంగనా మాట్లాడుతూ..” చంద్రముఖి సినిమాలో జ్యోతిక నటన అద్భుతం ఆమె నటనకు దీటుగా ఎవరి వల్ల కాదు జ్యోతిక స్థాయిలో నటించే అంత సీన్ నాకు లేదు అయితే జ్యోతిక రేంజ్ లో నన్ను కంపేర్ చేస్తే చూస్తే మాత్రం నిరాశ తప్పదు అని చెప్పగలను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కంగనా మాటలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.. ఇక మరో విషయం ఏమిటంటే చంద్రముఖి 2 లో కూడా ముందు జ్యోతికని అడిగినట్లు సమాచారం.. అయితే ఆమె నిరాకరించడంతో ఆ పాత్ర కంగనా చేతికి చేరింది. ఇకపోతే చంద్రముఖి ని తెరకెక్కించిన సీనియర్ డైరెక్టర్ పి వాసుని ఇప్పుడు సీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు. రాఘవ లారెన్స్ ఈ సినిమాలో సూపర్ స్టార్ రజిని పాత్రలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version